కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ యూనిట్,ప్రాజెక్ట్,నివేదిక,
కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ యూనిట్ నేటి పోటీ యుగంలో ఇతరులతో పోటీ తట్టుకొని వ్యాపార పారిశ్రామి క సేవా రంగాలలో దీర్ఘకాలం నిలబడాలంటే ఇతరులకన్నా భిన్నమైన పద్ధతులను అనుసరించి ప్రస్తుతం వినియోగదారులను నిలబెట్టుకోవడం నూతన వినియోగదారులనుఆకర్షించడంతప్పమరో మార్గం లేదు. తక్కువ పెట్టుబడితో ప్రారంబించేఅవకాశం నుండి లక్షలాది మందికి ఉపాధి కాల్పిస్తున్నా అనేక సేవారంగాలలోటైలరింగ్ రంగం ఒకటి. టైలరింగ్ ను వృత్తిగా స్వీకరించి ప్రత్యేక షాపులను ఏర్పాటు చేసుకొని జీవనం సాగించే వారు కొందరైతే, తమ ఇంటిలోనే టైలరింగ్ చేస్తూ కుటుంబానికి అదనపు ఆదాయం సమకూర్చటం కోసం కృషి చేసే వారు మరికొందరు. టైలరింగ్ ను పూర్తి కాలం వృత్తిగా స్వీకరించిన వారిలో మగవారు అత్యధిక శాతం ఉండగా ఇళ్లలోనే పార్ట్ టైం వృత్తిగా పనిచేసే వారిలో మహిళలు అత్యధిక శాతం వుండుట గమనార్హం. వీరిలో ఎక్కువ శాతం నామమాత్రపూ చదువు చదివిన వారే. మిగిలిన అన్నీ రంగాలలో మాదిరిగానే టైలరింగ్ రంగం లో కూడా ఎన్నో మార్పులు రావడం వలన దశాబ్దం తరబడి టైలరింగ్ నే వృత్తిగా చేసుకొని జీవిస్తున్న సామాన్యులు తమ జీవనం కై సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ క్రింది కారణాల వల్ల టైలరింగ్ రంగంలో సంక్షోభం ఎదుర్కొనాల్సి వస్తుంది.
1) అధిక పెట్టుబడితో ముడి పదార్దాలనుతక్కువ ధరకే కొనగలిగి, అతి తక్కువ సమయంలో కుట్టగలిగే కరీదైన యంత్రాలను వుపయోగించే రెడీమేడ్ దుస్తుల తయారీ కంపెనీలు అధికమవ్వడం వల్ల, వినియోగదారులు వాటివైపు అధికంగా మళ్ళడం.
2) ఫ్యాషన్ డిజైనింగ్ వంటి వృత్తి పరమైన కోర్సులు చేసినవారు టైలరింగ్ రంగంలో ప్రవేశించడం వలన
3) టైలరింగ్ రంగంలో తక్కువ కర్చుతో ప్రవేశించడం వీలు పడుతున్నందున చదువుకున్న వారికి ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నందున నూతనంగా టైలరింగ్ రంగంలో ప్రవేశించే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది.
4) టైలరింగ్ నే వృత్తిగా చేపట్టిన వారి చదువులకు ఇతర వృత్తిపరమైన పరిజ్ఞానంతో తక్కువ స్థాయిలో వుండటం వలన ఇతర రంగాలకు వలసపోయే అవకాశం లేకపోవడం వలన.
5) ఆధునిక యంత్రపరికరాల వాడకం పరిజ్ఞానం లేకపోవడం.
నేడు పోటీ అధికంగా ఉన్న టైలరింగ్ రంగంలోనికి నూతనంగా ప్రవేశించే వారు లేదా దీర్ఘకాలం ఇదే రంగంలో కొనసాగాలని భావించేవారు ఇతరులకు భిన్నంగా వుండే సేవలను వినియోగదారులకు అందించడానికి ప్రయత్నించడం అవసరం. నూతనత్వం కోసం ఎదురుచూసే వారికి కంప్యూటరైజ్డ్ కుట్టు ఎంబ్రాయిడరీ యంత్రం ఓ మంచి సాదన అవుతుంది.
కంప్యూటరైజ్డ్ కుట్టు అండ్ ఎంబ్రాయిడరీ మెషీన్ :
కంప్యూటర్ ఆవిర్భావం తరువాత ఆధునిక మానవుని జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. సమాచార సాంకేతిక రంగంలో కంప్యూటర్ ప్రవేశం తరువాత ప్రపంచమంత ఒక గ్లోబల్ విలేజిగా మరిందంటే ఆశ్చర్యం కాదు. అలాగే వైద్యరంగంలో కంప్యూటర్ ప్రవేశం తో రోగనిర్ధారణ, ఆపరేషన్ల నిర్వహణలో విప్లవాత్మకమార్పులు వచ్చాయి. టెలీ మెడిసిన్ సౌలభ్యంతో గ్రామీణ ప్రాంతాల వారు కూడా నిష్ణాతులైన వైద్యుల సలహాలు పొందేవీలుంది. అలాగే కంప్యూటర్ ప్రవేశంతో టెక్స్ టైల్ డిజైనింగ్ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నిన్న మొన్నటి దాకా ఎంతో ఓపికగా కేవలం చేతుల మీదనే చేయగలిగిన ఎంబ్రాయిడరీ ఇప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానంతో యంత్ర సహాయంతో చేయడానికి వీలుపడుతుంది. గతంలో నెలల తరుబడి చేసే ఎంబ్రాయిడరీ పనులు ఇప్పుడు కేవలం ఒక్క రోజులో లేదా కొన్ని గంటలలో చేయడం కంప్యూటర్ ఆధారిత యంత్రం వలన వీలుపడుతుంది.
నాలుగైదు రకాల యంత్రాలు:
కంప్యూటరైజ్డ్ కుట్టు మరియు ఎంబ్రాయిడరీ యంత్రలను ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు.
1) కంప్యూటరైజ్డ్ కుట్టు యంత్రాలు.
2) కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ యంత్రాలు.
3) కంప్యూటరైజ్డ్ కుట్టు ఎంబ్రాయిడరీ యంత్రాలు.
4) కంప్యూటరైజ్డ్ మల్టీ హెడ్ ఎంబ్రాయిడరీ యంత్రాలు.
కంప్యూటరైజ్డ్ కుట్టు యంత్రాలు:
కంప్యూటరైజ్డ్ కుట్టు యంత్రాలు సాధారణంగా కుట్టు పనులతో పాటు డిజైన్ కుట్టు పనులకు కూడా ఉపయోగించవచ్చు. 240 మన్న్చి అందమైన డిజైన్ కుట్టు వివిధ స్టైల్స్ లో ఇంగ్లీష్ అక్షరాలు యంత్రంలోనే లోడ్ చేసి వుంటాయి.ఈ యంత్రలతో బటన్ రంద్రాలనుకుద కుట్టవచ్చు. గుండీలు కుట్టడం, ఫ్యాచ్ వర్క్, ఓవర్ లకింగ్, హెమ్మింగ్, డార్నింగ్, Roll & Shelf Ierning, Blindstch, edge shucfn Lace, Eyket work ఇతర ప్రత్యేక కుట్టు పనులు ఒక్క యంత్రంపై చేయడం వీలుపడుతుంది. ఈ కంప్యూటరైజ్డ్ కుట్టు మిషన్ తో సాధారణకుట్టు పనులతో పాటు చిన్న పిల్లల జుబ్బాలు, కుర్తాలు, సఫారిలపై డిజైన్లు కూడా చేయవచ్చు.పంజాబీ డ్రస్సులపై Neck-palterny చీరాలపై బార్డర్లను కూడా అందంగా చేయవచ్చును.
కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ యంత్రాలు:
ఈ యంత్రాల వలన కేవలం ఎంబ్రాయిడరీ చేయడం వీలుపడుతుంది. 900 పైగా వివిధ రకాల ఎంబ్రాయిడరీ డిజైన్లు ఈ యంత్రంలోనే లోడ్ చేయబడి వుంటాయి. అంతేకాకుండా తమకు ఇస్టమైన డిజైనును సాధారణ కంప్యూటర్ పై చేసుకొని ప్లాపీ ద్వారా ఈ ఎంబ్రాయిడరీ యంత్రంలో లోడ్ చేసుకునే అవకాశం వుంది. ఈ యంత్రంలో నిమిషానికి 600 ఎంబ్రాయిడరీ కుట్లు వేసే అవకాశం వుంది. మరెన్నో ఆధుక ఎంబ్రాయిడరీ వసతులు వున్న మిషన్లు కేవలం ఎంబ్రాయిడరీ పనులకు వాడడం వీలు పడుతుంది.
కంప్యూటరైజ్డ్ కుట్టు ఎంబ్రాయిడరీ యంత్రాలు:
పైన వివరించిన రెండు రకాలైన యంత్రాల లక్షణాలు ఈ కుట్టు ఎంబ్రాయిడరీ యంత్రాలు గలిగి వుంటాయి.అందువల్ల ఈ మిషన్లు స్వయం ఉపాధి అవకాశాలకు బాగా ఉపకరిస్తాయి. 14 7 సైజు వరకు ఎంబ్రాయిడరీ డిజైనూ ఈ మిషన్ తో తయారు చేయవచ్చు. 1000కి పైగా అలంకరణ కుట్లు 600కి పైగా అందమైన ఎంబ్రాయిడరీ డిజైన్లు, అనేక రకాల ఇంగ్లీష్ అక్షరాలుమరెన్నో అనుకూల లక్షణాలు ఈ మిషన్లు కలిగి ఉంటాయి.యంత్రంలో లోడ్ చేసిన డిజైన్లు మరియు కుట్టు మాత్రమే కాకుండా ఎవరికి ఇష్టమైన వాటిని వారు డిజైన్ చేసుకొని లోడ్ చేసుకునే కకూడా ఉంది. ఈ మిషన్ల ద్వారా ఎటువంటి వస్త్రాలపైనా అయినా అనగా కాటన్, టెరికాటన్, సిల్క్, జీన్స్, లేదర్ (తోలు) అందమైన ఎంబ్రాయిడరీ డిజైన్లకు అందమైన అల్లికలను రూపొందించుకోవచ్చు. పై మూడు రకాలైన కంప్యూటరైజ్డ్ కుట్టు ఎంబ్రాయిడరీ మిషన్లను ఎటువంటి కంప్యూటర్ పరిజ్ఞానం లేని వరైనా ఉపయోగించవచ్చు. అందువల్ల చిన్న వ్యాపార సంస్థలను ప్రారంభించి
Comments
Post a Comment